కొండా సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అక్కినేని హీరో.. దుమారం రేపుతున్న ట్వీట్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్టార్ హీరోయిన్ సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్టార్ హీరోయిన్ సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటూ సినీ ఇండస్ట్రీలోనూ దుమారం రేపుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న ఓ మహిళ మరో మహిళ గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేటని కొండా సురేఖపై పలువురు సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కొండా సురేఖ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ సంచలన ట్వీట్ పెట్టాడు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని మండిప‌డ్డారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని అన్నారు.

“కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత మరియు సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. గౌరవనీయమైన పౌరులు మరియు నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు మరియు అగౌరవంగా మిగిలిపోయారు. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు మరియు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి.. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు , మన్నన లేదు. ఇది క్షమించబడదు, సహించదు.” అని అఖిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Similar News