ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పుష్ప-2’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

Update: 2024-10-04 08:19 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ 2024లో ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే పుష్ప-2 నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేశాయి. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన సెకండాఫ్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం. ఒక టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తుండగా.. ఇంకో టీమ్ కాకినాడలో చేస్తున్నారు. అయితే పుష్ప-2 అక్టోబర్ చివరి నాటికి కంప్లీట్ చేసి నవంబర్‌లో ప్రమోషన్స్ చేయనున్నట్లు టాక్.

ఈ క్రమంలో.. తాజాగా, పుష్ప-2 మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ట్రైలర్ నవంబర్‌ రెండో వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా నాలుగు పాటలతో పాటు క్లైమాక్స్‌లోని స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ కానున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News