Crazy update on Pawan Kalyan-Sujeeth movie :అభిమానులకు గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో యువ డైరెక్టర్ సుజిత్ సినిమా ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో యువ డైరెక్టర్ సుజిత్ సినిమా ఒకటి. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మూవీ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ శుభవార్త చెప్పారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. జనవరి 30న సినిమాను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత డీవీవీ దానయ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
దీంతో అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. 'రన్ రాజా రన్', 'సాహో' లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజీత్, పవన్‌తో కొత్త సినిమాను డిసెంబర్ 2022లో అధికారికంగా ప్రకటించారు. జనవరి 30న హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమాను DVV దానయ్య హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.