పర్ఫెక్ట్ షేప్స్‌తో చంపేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో దీపికా పదుకుణె ప్రధాన పాత్రలో మెప్పించగా.. యంగ్ హీరోయిన్ దిశా పటానీ గ్లామర్ రోల్లో అలరించింది. స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సేపే అయినప్పటికీ.. ప్రభాస్‌తో ఉన్న ఆమె సన్నివేశాలకు మంచి మార్కులే పడ్డాయి. ఇక మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అవ్వడమే కాకుండా.. కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తుంది.
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. పదకొండు రోజుల్లోనే రూ. 900 కోట్లు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా యూనిట్ ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ కల్కి టీమ్‌తో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో తన క్యారెక్టర్‌కు సంబంధించిన కొన్ని పిక్స్ హైలెట్ కాగా.. నడుము, నాభి అందాలను చూపిస్తున్న అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా ‘పర్ఫెక్ట్ షేప్’ అంటూ కంప్లీమెంట్స్ ఇస్తున్నారు.