బిగ్ బాస్ స్టార్ కి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

టాలీవుడ్ నటి, బిగ్ బాస్(BigBoss) స్టార్ శుభశ్రీకి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.

Update: 2024-10-06 10:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటి, బిగ్ బాస్(BigBoss) స్టార్ శుభశ్రీకి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ షూటింగ్ నిమిత్తం వెళ్తున్న శుభశ్రీ కార్ ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా.. శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆమె ప్రయాణిస్తున్న కార్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే బైక్ మీద వస్తున్న వ్యక్తులు మద్యం సేవించి ఉండటం వలన ఈ ఘటన జరిగిందని ప్రాథమిక సమాచారం. ఒడిశాకు చెందిన నటి శుభశ్రీ బిగ్ బాస్ సీజన్ 7 తో భారీగా తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకుంది. రీసెంట్ గా తెలుగు ర్యాపర్ రోల్ రైడతో కలిసి చేసిన 'కాకినాడ కాజా' సాంగ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. శుభశ్రీ కార్ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళనకు గురవగా.. ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. 


Similar News