ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్న సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పదేళ్లపాటు ఇండస్ట్రీలో రాణించింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

Update: 2024-10-06 11:15 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పదేళ్లపాటు ఇండస్ట్రీలో రాణించింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సామ్ ఎన్నో చిత్రాల్లో నటించి వరల్డ్ వైడ్‌గా అభిమానులు దక్కించుకుంది. హీరోయిన్‌గానే కాకుండా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా ’ ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసి దుమ్మురేపింది. కానీ మయోసైటీస్ వ్యాధి రావడంతో గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇటీవల రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సమంత రీఎంట్రీలో ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్- తారక్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్, సమంత తెరపై కనిపిస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Read More..

NTR: రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్ 


Similar News