ఓటీటీలో అదరగొడుతున్న ‘35 చిన్న కథ కాదు’.. నాలుగు రోజుల్లో సరికొత్త రికార్డు

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘35 చిన్న కథ కాదు’.

Update: 2024-10-06 10:39 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘35 చిన్న కథ కాదు’. ఈ సినిమాను నంద కిషోర్ తెరకెక్కించగా.. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. అయితే ఇందులో విశ్వ దేవ్, గౌతమి, భాగ్యరాజా, అరుణ్, కీలక పాత్రలో కనిపించారు. గత నెల థియేటర్స్‌లో విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది.

అక్టోబర్ 2న ఆహాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా, ‘35 చిన్న కథ కాదు’ మూవీ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్లు ఆహా ‘X’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆహాలో ఈ చిత్రం అదరగొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 70 మిలియన్+ మినిట్స్ వ్యూయర్ షిప్‌ను దక్కించుకుని సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఇంకా ఓటీటీలో 35 చిన్న కథ కాదు ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది.

Read More..

ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు 



Similar News