‘దేవర’ సునామి.. 6 రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే.. హైప్ పెంచేస్తున్న స్పెషల్ పోస్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర.

Update: 2024-10-03 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రం రిలీజై నేటితో 6 డేస్ అవుతుంది. మరి ఆరు రోజుల్లో దేవర కలెక్షన్స్ ఎంతనో ఇప్పుడు మనం చూద్దాం..

తాజాగా దేవర రూ.350 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆరు రోజుల్లో ఈ మూవీకు రూ.396 కోట్లు వచ్చినట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గాంధీ జయంతి హాలిడే కావడంతో కలెక్షన్లు పెరిగాయి. కాగా కొన్ని సీన్లను యాడ్ చేసి దసరా నుంచి స్క్రీనింగ్ చేస్తారని టాక్. దీంతో ఈ మూవీకి దసరా హాలిడేస్ ప్లస్ పాయింట్ కానుంది.



Similar News