బిగ్ బాస్-8: ఒకేసారి హౌస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆదిరెడ్డి

బిగ్ బాస్- 8 రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతోంది.

Update: 2024-10-03 09:32 GMT

దిశ, సినిమా: బిగ్ బాస్- 8 రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్.. సక్సెస్ ఫుల్‌గా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం కూడా భిన్నమైన టాస్క్‌లతో హౌస్ మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న బిగ్‌బాస్.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే.. గత ఎపిసోడ్ చూసుకుంటే.. ‘మీరు మీకు ఇచ్చిన చాలెంజెస్ అన్నిటిని పూర్తి చెయ్యని కారణంగా హౌస్‌లోకి ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ మీదకు తుఫానులా దూసుకువస్తు్నాయి’ అని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చే ఆ ఎనిమిది కంటెస్టెంట్స్ ఎవరా అని బిగ్ బాస్ లవర్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ.. బిగ్‌బాస్ సీజన్ 6 ఫేమ్ ఆది రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. దీని ప్రకారం.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఆ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ (మెహబూబు, హరితేజ, నైనీ పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ). ఈ శనివారం ఎపిసోడ్‌లోనే వీళ్ల ఎంట్రీ ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి.


Similar News