మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వైజయంతి మూవీస్

హీరోయిన్ సమంత, చైతూ డివోర్స్ పై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Update: 2024-10-03 11:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: హీరోయిన్ సమంత, చైతూ డివోర్స్ పై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ను విమర్శించే నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వల్లే సమంత విడాకులు తీసుకుందంటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ క్రమంలో సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పై తాజాగా వైజయంతి మూవీస్ స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపింది. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం. జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించం అని.. మా పరిశ్రమను, దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. కలిసి నిలబడతాం అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


👉 Also Read:: కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు.. కేటీఆర్‌కు సంచలన వార్నింగ్ 


Similar News