‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో భాగం అయ్యా నా కల నిజమైంది.. నటుడి ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో ఒకటి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాను టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో పాపులర్ యాక్టర్, స్టార్ హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా, ప్రసన్న దీనిపై ‘X’ రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రియమైన మిత్రులారా.. ఈ సారి నా ప్రియమైన అజిత్ కుమార్ సినిమాలో నేను భాగమయ్యాను అనేది ఎట్టకేలకు నిజం. నా కల నిజమైంది. మంకథా నుంచి ఏకే సార్ సినిమా అనౌన్స్ చేసినప్పుడల్లా అందులో నేను భాగమని భావించేవారు. అతని అభిమానులు ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. నేను అతని తదుపరి చిత్రంలో ఉన్నాను. కానీ వారు చెప్పినట్లు ‘కప్, పెదవి మధ్య చాలాసార్లు స్లిప్ అవుతుంది’. చివరగా నేను గుడ్ బ్యాడ్ అగ్లీలో భాగమయ్యాను. దేవుడికి, ఎకెకి, అధిక్‌కి, సురేష్ చంద్రకి, మైత్రీ మూవీస్‌కి, చివరగా నాట్‌లాస్ట్ నాట్ దిలీస్ట్‌గా తన సినిమాలో నన్ను చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.
నేను థ్రిల్‌గా, ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పుడు చాలా విషయాలు వెల్లడించలేను కాబట్టి క్షమించండి. నా పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో కొన్ని రోజులు పాల్గొన్నాను. అజిత్ గురించి మీకు, నాకు మాత్రమే తెలుసు. మనిషి ఎంత వినయంతో నిండి ఉంటాడో అంతగా నిలదొక్కుకున్నాడు’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. కానీ ఏ పాత్రలో నటించనున్నాడో వెల్లడించలేదు. దీంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీపై సోషల్ మీడియాలో హైప్ నెలకొంది.