Chandu Champion Movie: ఓటీటీలోకి వచ్చేసిన చందు ఛాంపియన్

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటీటీలోనే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.

Update: 2024-07-26 08:50 GMT

దిశ, సినిమా : ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటీటీలోనే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. వారి కోసం ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలను తీసుకొస్తున్నాయి. ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఓటీటీలో బాలీవుడ్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఆ సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ బయోపిక్ మూవీ అయినా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలుస్తుంది. ప్రముఖుల వ్యక్తిగత జీవితాల ఆధారంగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో థియేటర్లో సందడీ చేసిన బయెపిక్ చందు ఛాంపియన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు పారాలింపిక్ స్వర్ణపతక మురళీకాంత్ పేట్కర్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. అలాగే రిలీజ్ అయ్యాక రికార్డ్స్ బ్రేక్ చేసింది.

జూన్ 14 న రిలీజ్ అయినా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని వరల్డ్ వైడ్ గా రూ.88 కోట్లకు పైగా వసూలు చేసింది. కబీర్ ఖాన్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ మూవీ ఉచితంగా చూడటానికి వీల్లేదు. రూ.199 చెల్లించి రెంట్ పద్దతిలో చూడవచ్చు.

Tags:    

Similar News