Bigg Boss Sonia: బిగ్‌బాస్ సోనియా పెళ్లి అప్పుడే.. నెట్టింట వైరలవుతోన్న బాయ్‌ఫ్రెండ్ పోస్ట్

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది ప్రస్తుతం ఏడో వారం నడుస్తోంది.

Update: 2024-10-18 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది ప్రస్తుతం ఏడో వారం నడుస్తోంది. అయితే ఆకుల సోనియా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమెతో పాటుగా బిగ్‌బాస్ హౌస్‌లో బెజవాడ బేబక్క, అభయ్ నవీన్, శేఖర్ బాషా, నైనిక, ఆదిత్య ఓం, ప్రేరణ, యష్మీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఇందులో సోనియా హౌస్‌లో చేసిన రచ్చకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్స్ కు గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరై.. హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేశానని వెల్లడించింది. కిచెన్ పని కూడా తానే చూసుకున్నానని వెల్లడించింది. కానీ బిగ్ బాస్ తనను తప్పుగా చూపించాడని.. అంతా కట్ చేసి చూపించి.. జనాల దృష్టిలో బ్యాడ్ అయ్యేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిన సోనియా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై తన ప్రియుడు గురించి తెలిపింది. అతడు పేరు యష్ వీరగోని. ఈయనకు ఫ్లై హై అనే టూరిజం కంపెనీ ఉందట. సోనియా ప్రియుడు కూడా ఓ ఇంటర్వ్యూలో.. సోనియా నేను మూడేళ్లగా కలిసి పనిచేస్తున్నామని వెల్లడించాడు.

తను మా కంపెనీలోనే పని చేస్తుందని అన్నాడు. మా కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి అంగీకరించారని, నిజానికి సోనియా బిగ్ బాస్ వెళ్లకముందే వివాహం చేసుకుందామనుకున్నామని పేర్కొన్నాడు. కానీ తనకు బిగ్ బాస్‌లో అవకాశం వచ్చిందని అన్నాడు. కాగా డిసెంబరు లో పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించాడు. ఇక యష్ వీరనేని రీసెంట్‌గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సోనియా ఆర్జీవీ ప్రొడక్షన్‌లో ఈ అమ్మడు కరోనా, ఆశ, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.


Similar News