Naga Manikanta: హౌస్‌లో ఉండేందుకు నాగమణికంఠ భారీ ప్లాన్.. ఒక్కొక్కరికి ఒక్కో ఆఫర్..?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.

Update: 2024-10-17 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. పైగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చినప్పటి నుంచి హౌస్ లో మరింత సందడి నెలకొంది. సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ్ దక్కించుకున్న గంగవ్వతో హౌస్‌మేట్స్ ఫుల్ ఫన్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. పల్లెటూరి భాషలో గంగవ్వ జనాల్ని అలరిస్తుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ ఏడో వారం సాగుతోంది. నామినేషన్స్ అయిపోయాయి. ప్రస్తుతం హోరాహోరీగా టాస్కులు ఆడుతున్నారు హౌస్‌మేట్స్. ఇకపోతే నాగమణికంఠ స్టార్టింగ్‌లో ఫ్యామిలీ అంతా దూరమైందని.. తన భార్య, బిడ్డ కావాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొదట్లో ప్రతి చిన్న విషయానికి ఏడ్చినా.. రాను రాను ఆటలో దూసుకుపోతున్నారు. హౌస్‌మేట్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే నిన్నటి (అక్టోబరు 16)ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అంతా సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాగమణికంఠ.. గంగవ్వతో నామినేషన్స్ లో సేవ్ అయితే బంగారం కొనిపెడతానని అంటాడు. అంతేకాదండోయ్ సేవ్ అయినా ప్రతిసారి గంగవ్వకు అరతులం గోల్డ్ ఇప్పిస్తానని చెబుతాడు. తర్వాత హరితేజ మరీ నాకు ఏం కొనిస్తావు..? నాకైతే గోల్డ్ వడ్డాణం కావాలంటుంది. దీంతో మణికంఠ బేగంబజార్ కు వెళ్లి డూప్లికేట్ వడ్డాణం కొనిస్తానని అంటాడు. తర్వాత రోహిణి అడగడంతో ముద్దు ఇస్తానని తెలిపాడు మణికంఠ. దీంతో అంతా షాక్ అవుతారు. ఇక ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హౌస్‌మేట్స్ ను మణికంఠ బాగానే కాకపడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


Similar News