Tollywood heroine: ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. మెగా హీరో కోసమేనా?

సినీ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

Update: 2024-10-17 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అప్పట్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండ్ మోహ్రీన్ ప్రేమలో ఉన్నారని.. త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ.. ఇక ఈ నటి మెగా కోడలు అయినట్లేనని నెట్టింట ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. దీంతో సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించి.. ఈ పుకార్లను కొట్టిపారేశారు. తర్వాత మెహ్రీన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తను భవ్య బిష్టోయ్ అనే పర్సన్ తో ప్రేమలో ఉందని.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని అన్నారు.

మరీ ఇప్పుడు వస్తోన్న వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మెహ్రీన్ అండ్ తన ప్రియుడు భవ్య బిష్టోయ్ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. దీంతో మెగా హీరోతో ప్రేమలో ఉన్నదన్న రూమర్లు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ కోసమే మెహ్రీన్ ఈ పెళ్లి రద్దు చేసుకుందేమోనంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ ప్రచారంపై హీరోయిన్ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక సాయి ధరమ్ తేజ్ అండ్ మెహ్రీన్ కలిసి జవాన్ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

ఇక మెహ్రీన్ సినిమాల విషయానికొస్తే.. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తర్వాత మెహ్రీన్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ఎంత మంచివాడవురా, అశ్వత్థామ, డీఎస్పీ దేవ్, కవచం,నోటా 2018, C/o సూర్య, పంతం, రాజా ది గ్రేట్, మహానుభావుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. 


Similar News