జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-07 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జానీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

అత్యాచార కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు తీసుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండుకు తరలించే అవకాశం ఉంది. కాగా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు ఇవ్వకుండా నిలిపి వేసినందుకు చాలా మంది కొరియోగ్రాఫర్లు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.


Similar News