NTR: యాక్టింగ్‌లోకి అభయ్, భార్గవ్.. తనయుల సినీ ఎంట్రీపై తారక్ ఊహించని కామెంట్స్
తాజాగా తనయులు అభయ్, భార్గవ్‌ల సినీ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా తనయులు అభయ్, భార్గవ్‌ల సినీ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన తారక్‌కు అభయ్, భార్గవ్ సినిమాల్లోకి వస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఎన్టీఆర్ ఆసక్తికరంగా బదులిచ్చారు. తన అభిప్రాయాల్ని పిల్లల మీద రుద్దడం తారక్‌కు ఇష్టం లేదని తెలిపారు. వాళ్ల ఇష్టాన్ని గౌరవిస్తానని అన్నారు. కాగా భార్గవ్, అభయ్ ఏం అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి రెడీ అని చెప్పుకొచ్చారు. కానీ నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నాను కదా? నా పిల్లలు కూడా యాక్టింగ్‌లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదని వివరించారు. అలాంటి విషయాల్లో పిల్లల్ని అస్సలు ఇబ్బంది పెట్టనన్నారు. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడూ నువ్వు ఇదే రంగంలో రాణించాలిరా అని ఎప్పుడు ఫోర్స్ చేయలేదని పేర్కొన్నారు.
కాబట్టి నేను నా పిల్లల పట్ల అలా ప్రవర్తించనని అన్నారు. కానీ తన కెరీర్ గురించి పిల్లలకు తెలుసునని చెప్పారు. కాగా ఫాదర్ యాక్టింగ్‌లో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడవాలని ఆలోచనలు రావడం కామన్ అని వెల్లడించారు. దీంతో నందమూరి అభిమానుల్లో జోష్ పెరుగుతోంది. ప్రస్తుతం తారక్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోల ఫ్యామీల నుంచి వారసులు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఒకటి. తర్వాత ఘట్టమనేని, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి.. ఇలా ఎంతో మంది అగ్ర హీరోల వారసులు వెండితెరపై మెరుస్తున్నారు. అతితక్కువ సమయంలోనే అద్భుతమైన నటనతో స్టార్ గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.