అరుదైన ఘనత: మొద‌టి ఇండియ‌న్ యాక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న వారిలో దీపికా పదుకొణె ఒకరు.

Update: 2024-05-18 13:19 GMT
అరుదైన ఘనత: మొద‌టి ఇండియ‌న్ యాక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ హీరోయిన్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న వారిలో దీపికా పదుకొణె ఒకరు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో వెండితెరకు పరిచయమైన ఈమె.. అనతికాలంలోనే మంచి స్టార్‌డమ్‌‌ను సొంతం చేసుకుంది. ఇక స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో కూడా బిజీగా ఉంది. అయినప్పటికీ జోరు తగ్గని ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతే కాకండా ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఆచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే.. దీపికా పదుకొణె తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్‌ మ్యాగజైన్‌ డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ 2024 జాబితాలో ఈ భామ స్థానం సొంతం చేసుకుంది. ప్రతి ఏడాది ఈ మ్యాగజైన ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది విడుద‌ల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికాకు ఆ స్థానం దక్కింది. అంతే కాకుండా డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ మ్యాగ‌జైన్‌లో చోటు ద‌క్కించుకున్న మొద‌టి ఇండియ‌న్ యాక్టర్‌గా దీపిక నిలవ‌డం విశేషం.

Tags:    

Similar News