అమ్మ నీ ప్రేమకు దాసులం..
అమ్మ ప్రేమకు అవధులు లేవు. తల్లి త్యాగాలకు హద్దులు లేవు. అన్ని చోట్ల తను ఉండలేడని దేవుడు అమ్మను సృష్టించాడు అంటుంటారు. సృష్టికి జీవం పోసే ఆ రెండక్షరాల ప్రేమ గురించి చెప్పేందుకు ఆ దేవుడికే సాధ్యం కాలేదు.. మానవ మాత్రులం మనమెంత. జన్మనిచ్చి, లాలించి, పెంచి, పెద్ద చేసి.. మనం ఒక ఉన్నత స్థానంలో ఉండేంత వరకు ప్రతీ అడుగులోనూ తోడుండే అమ్మ గురించి సినీ ప్రముఖుల మాటల్లో. Behind all our stories, there […]
అమ్మ ప్రేమకు అవధులు లేవు. తల్లి త్యాగాలకు హద్దులు లేవు. అన్ని చోట్ల తను ఉండలేడని దేవుడు అమ్మను సృష్టించాడు అంటుంటారు. సృష్టికి జీవం పోసే ఆ రెండక్షరాల ప్రేమ గురించి చెప్పేందుకు ఆ దేవుడికే సాధ్యం కాలేదు.. మానవ మాత్రులం మనమెంత. జన్మనిచ్చి, లాలించి, పెంచి, పెద్ద చేసి.. మనం ఒక ఉన్నత స్థానంలో ఉండేంత వరకు ప్రతీ అడుగులోనూ తోడుండే అమ్మ గురించి సినీ ప్రముఖుల మాటల్లో.
Behind all our stories, there is always our mother’s story.
Because that is where we all begin. Precious MOMents. #HappyMothersDay @PawanKalyan @NagaBabuOffl #Vijaya #Madhavi pic.twitter.com/uIZ6QCm3Sg— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2020
అమ్మను మించిన దైవమున్నదా అని చెప్పే మెగాస్టార్ చిరంజీవి.. మన కథలన్నింటి వెనుక.. మన తల్లి కథ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మన జీవితం ప్రారంభమయ్యేదే అక్కడ అన్న చిరు.. తల్లితో ఉన్న మధుర క్షణాలను పంచుకున్నారు. సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్, సోదరీమణులతో కలిసి అమ్మతో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
నటుడు సోనూ సూద్ .. అమ్మ నా లైఫ్ లో నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతున్నా అని తెలిపారు. నిన్ను నా స్కూటర్ మీద కాలేజ్ లో డ్రాప్ చేయడం.. స్టూడెంట్ గా నీ క్లాసులకు అటెండ్ కావడం.. నీ నుంచి లెటర్స్ అందుకోవడం.. నువు చెప్పినట్లు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అమ్మ. కానీ నా లక్ష్యాలు చేరుకునేందుకు నువు నాలో నింపిన స్ఫూర్తి ఎప్పుడూ నాతోనే ఉంటూ.. నడిపిస్తుంది. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అమ్మ.. నాన్న నిన్ను ఆ లోకంలో జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్ముతున్న అంటూ తల్లిని గుర్తుచేసుకున్నారు సోనూ సూద్.
అమ్మ తనను చిన్నప్పుడు అమ్మాయిలా తయారు చేసిన పిక్ ను షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. అందరూ అమ్మలు ఎందుకిలా అబ్బాయిలను చిన్నప్పుడు అమ్మాయిల డ్రెస్ లు, మేక్ అప్ వేసి తయారు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదన్నారు. బహుశా.. మహిళగా ఉండాలంటే ఎంత కష్టమో అని చెప్పేందుకా లేక వారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో తెలుసుకోవడానికా తెలియదని చెప్పారు. మన స్త్రీ మూర్తులను ప్రేమిద్దాం, రక్షిద్దాం.. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ లవ్ యూ అని చెప్పారు తేజ్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. మా అమ్మ నుంచి నేను నేర్చుకున్న గొప్ప పాఠం.. ఎంత సంపద ఉన్నా చాలా సింపుల్ గా జీవించడం. నాకు అన్ని వేళలా సపోర్ట్ గా ఉన్న అమ్మతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బన్నీ.
Even in this day and age, you’re the only one whose one hand on my head can comfort me in troubled times because I know there’s nothing I can’t do with your blessings maa. Happy #MothersDay ♥️ pic.twitter.com/bhpQ9UA7Sl
— Akshay Kumar (@akshaykumar) May 10, 2020
ఇంత పెద్దవాడిని అయినా సరే.. నిన్ను చూస్తే చాలు అమ్మ నా బాధలన్నీ మటుమాయం అవుతాయనే భరోసా కలుగుతుంది అన్నారు అక్షయ్ కుమార్. నేను ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే.. నీ చేతిని నా తలమీద పెట్టి ఆశీర్వదిస్తే చాలు అన్నిటినీ ఎదిరించగలను అని తెలిపాడు. నాకు తెలుసమ్మ నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే కారణం నీ ఆశీర్వాద బలమే అంటూ.. అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.