తెలంగాణలో ముగిసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన
తెలంగాణలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన నేటితో ముగిసింది.
దిశ, శంషాబాద్ : తెలంగాణలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన నేటితో ముగిసింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్కర్ లకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకట్రావు, రాష్ట్ర డిజిపి జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, తదితరులు వీడ్కోలు పలికారు. కాగా బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఉప రాష్ట్రపతి దంపతుల రెండు రోజుల పర్యటనను ముగించుకొని తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.