పాస్ వర్డ్ చెప్పి విచారణకు సహకరించాలి : ఐజి సత్యనారాయణ

లగచర్లలో కలెక్టర్, అధికారుల పై దాడిలో ముద్దాయి అయినా పట్నం నరేందర్ రెడ్డి తన సెల్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పి విచారణకు సహకరించాలని ఐజి సత్యనారాయణ సూచించారు.

Update: 2024-12-26 14:46 GMT

దిశ, పరిగి : లగచర్లలో కలెక్టర్, అధికారుల పై దాడిలో ముద్దాయి అయినా పట్నం నరేందర్ రెడ్డి తన సెల్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పి విచారణకు సహకరించాలని ఐజి సత్యనారాయణ సూచించారు. పరిగి పోలీస్ స్టేషన్ లో గురువారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజి సత్యనారాయణ మాట్లాడుతూ… ముద్దాయి పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉన్నది మర్చిపోయి విచారణను ప్రభావితం చేసేలా ప్రెస్ మీట్ లు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. తాను తీసుకున్న యాంటీ స్ప్రేటరీ బెయిల్ లో విచారణకు అవసరమయ్యే వాస్తవాలను ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆపే విధంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అతనికి ఇచ్చిన బెయిల్ లో కండిషన్లు ఉన్నాయన్నారు. కలెక్టర్ పై దాడి లో అక్రమంగా కేసులు పెట్టారని, నిఘా వైఫల్యం అని, పోలీసుల వైఫల్యం అని, ప్రభుత్వ వైఫల్యం అనడం కరెక్ట్ కాదన్నారు. నిఘా వ్యవస్థలు ముందు రోజే చెప్పాయని అందుకే ఫార్మా భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ వద్ద 230 ఉంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

కాగా బోగమోని సురేష్ కలెక్టర్ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకువెళ్లి దాడి చేశారన్నారు. గ్రామంలోకి వెళ్ళవద్దంటూ కొందరి వద్ద కారం దొరికిందని చెప్పేంత సమయం ఇవ్వకుండానే కలెక్టర్ మంచి హృదయంతో మన రైతులే కదా అంటూ గ్రామంలోకి వెళ్లారని అన్నారు. అక్కడ స్థానికులు కాకుండా మరికొందరు ఉండి, పెద్ద బండ రాళ్లతో దాడి చేసింది మీ అందరికీ తెలిసిందే నన్నారు. జిల్లా కలెక్టర్ పై దాడి, అధికారులపై దాడులు కట్టడి చేసేందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ కొనసాగిస్తున్నామన్నారు. ఇందుకు పట్నం నరేందర్ రెడ్డి, బొగమోనీ సురేష్ సహకరించడం లేదన్నారు. పైగా పట్నం నరేందర్ రెడ్డి విచారణకు సంబంధించిన వాస్తవాలను కట్టడి చేసేలా వాస్తవాలను బయటికి రాకుండా ప్రెస్ మీట్ లు పెట్టి ఆ వాస్తవాలను మాట్లాడటం వల్ల తన కండిషన్ బెయిల్ ను ఉపసంహరించినట్లేనన్నారు.

ఈ విషయమై తన బెయిల్ కండిషన్లు ఉపసంహరించిన పూర్తి సమాచారంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. జైల్లో ఓ కిందిస్థాయి సిబ్బంది వాళ్ళ బేడీలు వేసి తీసుకు వచ్చారని, ఈ సంఘటనకు కారణమైన అధికారిని సస్పెండ్ చేయడం కూడా జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం ఎలా బేడీలు వేయమని చెప్తుందని తమకు అది అవాస్తవమన్నారు. లగచర్ల దాడి మరుసటి రోజు పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకునే ప్రక్రియలో మహిళలపై దాడి చేశారని తాను ఈ విషయాన్ని కోర్టుకు లేఖ రాశానని పట్నం నరేందర్ రెడ్డి జైల్లో లేఖ రాసి ఉంటే మాకు చెప్పేవారు కదా, కనీసం కోర్టులోనైనా చెప్పేవారు కదా ఇదంతా అవాస్తవమన్నారు. లేఖ రాయడం అనేది అర్థం కానిది అర్థం లేనిదని ఐజి సత్యనారాయణ తెలిపారు. పట్నం నరేందర్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పి విచారణకు సహకరించాలని కోరారు.


Similar News