దారుణం: భర్త అలా చేశాడని కూతురి నరాలు కట్ చేసిన భార్య, ఆ తర్వాత

దిశ, ఏపీ బ్యూరో: భార్య భర్తల మధ్య గొడవలకు అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారి బలైపోయింది. భర్తపై కోపంతో తల్లి చిన్నారిని అత్యంత కర్కశంగా చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట కాలనీలో శ్రీనివాసులు, మీనాక్షి అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసులు చేనేత పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం […]

Update: 2021-08-13 04:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: భార్య భర్తల మధ్య గొడవలకు అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారి బలైపోయింది. భర్తపై కోపంతో తల్లి చిన్నారిని అత్యంత కర్కశంగా చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట కాలనీలో శ్రీనివాసులు, మీనాక్షి అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసులు చేనేత పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసులు పెద్ద కుమార్తె తనుశ్రీని వెంటబెట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.

తనకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడనే కోపంతో మీనాక్షి తన చిన్నకుమార్తె ప్రణతిని దారుణంగా హత్య చేసింది. ప్రణతి చేతి, మెడ నరాలను కట్ చేసింది. దీంతో చిన్నారి చనిపోయింది. కూతురు చనిపోవడంతో భయంతో మీనాక్షి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు శ్రీనివాసులకు సమాచారం అందించారు. శ్రీనివాసులు మీనాక్షిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం టౌన్ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల గొడవ వల్లే మీనాక్షి ఈ పనిచేసిందా లేక వేరేకారణమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News