విలేకరిపై ‘బంగ్లా కెప్టెన్’ ఆగ్రహం
తన ఫామ్‌పై ప్రశ్నించినందుకు బంగ్లాదేశ్ జట్టు వన్డే కెప్టెన్ మష్రఫె మోర్తాజా.. ఓ విలేకరిపై శివాలెత్తాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మోర్తాజానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఎనిమిది మ్యాచ్‌ల నుంచి ఫామ్‌లో లేని మోర్తాజా కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదే విషయం పట్ల ‘మీరు ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నందుకు […]
తన ఫామ్‌పై ప్రశ్నించినందుకు బంగ్లాదేశ్ జట్టు వన్డే కెప్టెన్ మష్రఫె మోర్తాజా.. ఓ విలేకరిపై శివాలెత్తాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మోర్తాజానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
గత ఎనిమిది మ్యాచ్‌ల నుంచి ఫామ్‌లో లేని మోర్తాజా కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదే విషయం పట్ల ‘మీరు ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నందుకు ఏమైనా సిగ్గుపడుతున్నారా..?’ అని విలేకరి ప్రశ్నించాడు. దీంతో సహనం కోల్పోయిన బంగ్లా కెప్టెన్.. ‘నేను క్రికెట్ మైదానాన్ని దొంగిలించానా..? నేనేమైనా దొంగనా సిగ్గుపడటానికి.. ఆత్మగౌరవం, సిగ్గుపడటం వంటి మాటలను నేను నా క్రికెట్ కెరీర్‌తో అన్వయించుకోను’ అని ఘాటుగా బదులిచ్చాడు. అంతే కాకుండా..’అయినా దొంగతనం, మోసాలు చేసేవాళ్లు ఉన్నారు. వాళ్లు సిగ్గుపడుతున్నారా..? ఆట విషయంలో ఫామ్‌లో లేక వికెట్లు తీయనంత మాత్రాన సిగ్గుపడాలా’ అని సమాధానం ఇచ్చాడు. తాను ఫామ్‌లో లేకుండా, వికెట్లు తీయలేకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నన్ను జట్టు నుంచి తప్పిస్తుంది. అంతేకాని ఈ విషయంలో ఎవరు ఏం ప్రశ్నించినా తాను ఇలాగే సమాధానం చెప్తానంటూ కోపంతో ఊగిపోయాడు.
కాగా.. జింబాబ్వేతో జరిగే సిరీసే మోర్తాజాకు కెప్టెన్‌గా చివరిదని..ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తామని ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఇప్పటికే స్పష్టం చేశారు.