డిమాండ్ పెరిగినా సరఫరా స్థిరంగా ఉంది : మారుతీ సుజుకి

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న వస్తువుల ధరలు, ముఖ్యంగా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మారిన బీఎస్6 వాహనాల్లో వినియోగించే ముడి పదార్థాల కారణంగా ఆటోమొబైల్ తయారీదారులపై వ్యయం పెరుగుతోందని మారుతీ సుజుకి సంస్థ తెలిపింది. జనవరిలో తన వాహనాల ధరలను పెంచిన మారుతీ సుజుకి, భవిష్యత్తులో వినియోగదారులపై వ్యయ భారాన్ని మోపేందుకు సిద్ధంగా లేదని, ఈ పరిణామాలపై నిశితంగా పరిశీలించి తగిన నిర్ణయాలను తీసుకోనున్నట్టు మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ […]

Update: 2021-02-14 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న వస్తువుల ధరలు, ముఖ్యంగా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మారిన బీఎస్6 వాహనాల్లో వినియోగించే ముడి పదార్థాల కారణంగా ఆటోమొబైల్ తయారీదారులపై వ్యయం పెరుగుతోందని మారుతీ సుజుకి సంస్థ తెలిపింది. జనవరిలో తన వాహనాల ధరలను పెంచిన మారుతీ సుజుకి, భవిష్యత్తులో వినియోగదారులపై వ్యయ భారాన్ని మోపేందుకు సిద్ధంగా లేదని, ఈ పరిణామాలపై నిశితంగా పరిశీలించి తగిన నిర్ణయాలను తీసుకోనున్నట్టు మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

ప్రధానంగా ఆటో పరిశ్రమకు సెమీకండక్టర్ల సరఫరాల్లో సవాళ్లు అధికంగా ఉన్నాయని, ప్రస్తుత నెలలో సాధారణ సరఫరా ఉన్నప్పటికీ పరిస్థితులను తేలికగా తీసుకోలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీఎస్6 వాహనాలకు వాడే ముడిపదార్థాల డిమాండ్ 80 శాతం వరకు ఉందని, డిమాండ్ పెరిగింది కానీ, సరఫరా స్థిరంగా ఉంది. దీన్ని అధిగమించే ప్రణాళికలను పరిశీలిస్తున్నట్టు శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. ఇటీవల ఆటో పరిశ్రమలో ధరల పెరుగుదల ఒరిజినల్ పరికారాల తయారీదారులు వస్తువుల ధరలను పెంచడం మూలంగా జరిగింది. దీనివల్ల కంపెనీలకు వ్యయం పెరగడం, ఖర్చులు అధికం కావడాన్ని గమనిస్తున్నాం. దీనికి అనుగుణంగా త్వరలో నిర్ణయాలను తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News