కరోనా సోకిన మహిళకు అందని ట్రీట్మెంట్.. ప్రధాని పదవికి రాజీనామా
దిశ,వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాల్ని కరోనా వణికించిన విషయం తెలిసిందే. ఆ వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయి.ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు దేశాధినేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్ని తట్టుకోలేని పలు దేశాలకు చెందిన నేతలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నారు. 2020 మార్చి నెలలో జర్మనీకి చెందిన ఆర్ధిక శాఖ మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ కూలిపోయింది. ఈ ఆర్థిక మాంద్యం […]
దిశ,వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాల్ని కరోనా వణికించిన విషయం తెలిసిందే. ఆ వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయి.ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు దేశాధినేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్ని తట్టుకోలేని పలు దేశాలకు చెందిన నేతలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నారు. 2020 మార్చి నెలలో జర్మనీకి చెందిన ఆర్ధిక శాఖ మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ కూలిపోయింది. ఈ ఆర్థిక మాంద్యం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళనకు గురైన జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ హొచీమ్ పట్టణంలో హై స్పీడ్ రైల్వే లైన్ పై ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా కరోనా కట్టడిలో విఫలమైన ఓ దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. మంగోలియాలో గర్భిణీకి కరోనా సోకింది. దీంతో అత్యవసర చికిత్స కోసం కరోనా వార్డ్‌కు తరలించగా.. బాధితురాలు బిడ్డకు జన్మనిచింది. మంగోలియా సంప్రదాయం ప్రకారం.. ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతలు నెల రోజుల పాటు చల్లటి వాతావరణం, చల్లటి ఆహారానికి దూరంగా ఉండాలి. అయితే గర్భిణీకి, నవజాత శిశువుకు మైనస్ 25 డిగ్రీల వాతావరణంలోనూ ఎటువంటి రక్షణ కల్పించలేదు. దీనిపై మంగోలియా రాజధాని ఉలాన్ బాతార్ ఆగ్రహాజ్వాలలు వెల్లువెత్తాయి. నిరసన కారుల్ని శాంతింపచేసేందుకు ప్రభుత్వం దిగివచ్చి ప్రజల్ని క్షమాణలు చెప్పింది. అయినా ప్రజలు శాంతిచకపోవడంతో ప్రధాని ఖురేలోసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. కరోనాను కట్టడిచేసే జాతీయ అత్యవసర కమిషన్‌కు చీఫ్‌గా వ్యవహరిస్తోన్న ఉప-ప్రధాని కూడా ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ రాజీనామా చేశారు.