20నిమిషాల్లోనే కరోనా గుర్తింపు..

దిశ, వెబ్‌డెస్క్: ఇకమీదట ఓ వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనేది అతితక్కువ సమయంలోనే తెలిసిపోనుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 20 నిమిషాల వ్యవధిలో కరోనాను నిర్ధారించే కొత్తరకం బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలుకున్నవారిని సైతం గుర్తించవచ్చునని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా ఈ పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధకులు 25 […]

Update: 2020-07-19 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇకమీదట ఓ వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనేది అతితక్కువ సమయంలోనే తెలిసిపోనుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 20 నిమిషాల వ్యవధిలో కరోనాను నిర్ధారించే కొత్తరకం బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలుకున్నవారిని సైతం గుర్తించవచ్చునని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా ఈ పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కోవిడ్ 19 కేసులను గుర్తించినట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఎర్ర రక్త కణాల క్లస్టరింగ్‌కు కారణమవుతాయి. ఇక దీనిని కంటితో సులభంగా గుర్తించవచ్చు. పరిశోధకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్, నెగెటివ్ రీడింగ్స్ పొందవచ్చునని మోనాష్ యూనివర్సిటీ వెల్లడించింది.

Tags:    

Similar News