ఇంగ్లాండ్ పర్యటనకు ఇద్దరు క్రికెటర్లు దూరం.. కారణమేమిటంటే..?
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ ఏడాది అగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. సుదీర్ఘంగా జరగనున్న ఈ పర్యటనలో మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఈ పర్యటనకు తాము దూరంగా ఉంటామని పేస్ బౌలర్ మహ్మద్ అమీర్, బ్యాట్స్‌మాన్ హరీస్ సోహైల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. ఆగస్టులో అమీర్ భార్య రెండో సంతానానికి జన్మనివ్వనుంది. అందుకే తాను పర్యటనకు అందుబాటులో ఉండనని చెప్పాడు. మరోవైపు కుటుంబం కారణంగా పర్యటనకు […]
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ ఏడాది అగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. సుదీర్ఘంగా జరగనున్న ఈ పర్యటనలో మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఈ పర్యటనకు తాము దూరంగా ఉంటామని పేస్ బౌలర్ మహ్మద్ అమీర్, బ్యాట్స్‌మాన్ హరీస్ సోహైల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. ఆగస్టులో అమీర్ భార్య రెండో సంతానానికి జన్మనివ్వనుంది. అందుకే తాను పర్యటనకు అందుబాటులో ఉండనని చెప్పాడు. మరోవైపు కుటుంబం కారణంగా పర్యటనకు రాలేనని సోహైల్ చెప్పినట్లు పీసీబీ వెల్లడించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడంతో త్వరలోనే 24 మంది ఆటగాళ్లతో టెస్టు, టీ20 జట్లను ప్రకటిస్తామని చెప్పింది. వీరితో పాటు మరో 14 మంది సిబ్బందిని కూడా ఎంపిక చేయనున్నట్లు పీసీబీ వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో జులైలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ వెళ్లి.. అక్కడి శిబిరాల్లో ప్రాక్టీస్ చేయనుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య సిరీస్‌ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది.