మొయిన్ అలీకి కరోనా పాజిటివ్

దిశ, స్పోర్ట్స్ : రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టుతో పాటు వచ్చిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. శ్రీలంకలోని హంబన్‌తోటా ఎయిర్ పోర్టులో ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొయిన్ అలీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడిని 10 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. అతడితో క్లోజ్ కాంటాక్ట్‌గా ఉన్న క్రిస్ వోక్స్‌ను కూడా 10 రోజుల […]

Update: 2021-01-04 09:50 GMT

దిశ, స్పోర్ట్స్ : రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టుతో పాటు వచ్చిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. శ్రీలంకలోని హంబన్‌తోటా ఎయిర్ పోర్టులో ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొయిన్ అలీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడిని 10 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. అతడితో క్లోజ్ కాంటాక్ట్‌గా ఉన్న క్రిస్ వోక్స్‌ను కూడా 10 రోజుల సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. వోక్స్‌కు మరో మూడు రోజుల తర్వాత పరీక్షించి నెగెటివ్ వస్తే జట్టుతో కలుపుతారు. అయితే ఈ నెల 14 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొయిన్ అలీ తొలి మ్యాచ్ ఆడటం అసాధ్యమే. 10 రోజుల క్వారంటైన్ అనంతరం మరో సారి పరీక్షించి నెగెటివ్ వస్తేనే జట్టుతో కలుస్తాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Tags:    

Similar News