మోడీ సుష్మా స్వరాజ్‌నూ అవమానించారు: గుత్తా

           తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారనీ, ఆయన వైఖరిని ఖండిస్తున్నట్టు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,బీజేపీ పూటకు ఒకలా మాట్లాడటం సరికాదన్నారు. నాడు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వడం వల్లే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని గుర్తుచేశారు. ప్రధాని తెలంగాణ ప్రజలనే కాదు.. సుష్మా స్వరాజ్‌నూ కించపరిచేలా […]

Update: 2020-02-07 05:46 GMT

తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారనీ, ఆయన వైఖరిని ఖండిస్తున్నట్టు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,బీజేపీ పూటకు ఒకలా మాట్లాడటం సరికాదన్నారు. నాడు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వడం వల్లే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని గుర్తుచేశారు. ప్రధాని తెలంగాణ ప్రజలనే కాదు.. సుష్మా స్వరాజ్‌నూ కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. మోడీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. నిజాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలను గౌరవించేలా మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

Tags:    

Similar News