9 సంవత్సరాలు మొబైల్‌కే అంకితం

దిశ, వెబ్‌డెస్క్: ‘స్మార్ట్ ఫోన్’.. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క డివైజ్ ప్రపంచాన్ని మార్చడమే కాదు, మనిషి జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిద్రపోయే కాసేపు తప్ప.. మిగతా టైమ్ అంతా ఫోన్‌తోనే గడిపేసేవాళ్లకు లెక్కేలేదు. ప్రస్తుతం ‘ఫోన్ అడిక్షన్’ కూడా ఓ వ్యాధిలా ముదురుతుండగా, ఈ తరం ప్రజలు తమ జీవితకాలం ముగిసేలోపు 9 సంవత్సరాలు ఫోన్‌కే కేటాయిస్తున్నట్లు మొబైల్ కంపారిజన్ సైట్ ‘విజిల్ అవుట్’ అధ్యయనంలో వెల్లడైంది. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇల్లే.. […]

Update: 2021-01-09 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘స్మార్ట్ ఫోన్’.. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క డివైజ్ ప్రపంచాన్ని మార్చడమే కాదు, మనిషి జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిద్రపోయే కాసేపు తప్ప.. మిగతా టైమ్ అంతా ఫోన్‌తోనే గడిపేసేవాళ్లకు లెక్కేలేదు. ప్రస్తుతం ‘ఫోన్ అడిక్షన్’ కూడా ఓ వ్యాధిలా ముదురుతుండగా, ఈ తరం ప్రజలు తమ జీవితకాలం ముగిసేలోపు 9 సంవత్సరాలు ఫోన్‌కే కేటాయిస్తున్నట్లు మొబైల్ కంపారిజన్ సైట్ ‘విజిల్ అవుట్’ అధ్యయనంలో వెల్లడైంది.

లాక్‌డౌన్ పుణ్యమా అని ఇల్లే.. ఆఫీస్‌, స్కూల్, కాలేజ్, ఆఖరకు థియేటర్‌గా కూడా మారిపోయింది. బంధువులు, ఉద్యోగులు, స్నేహితులు, ఎవరితో మాట్లాడాలన్నా.. ‘వీడియో కాల్’ శరణ్యంగా మారింది. ఇక షాపింగ్ చేయాలన్నా, సరుకులు కొనాలన్నా, చివరకు మందుల కోసం కూడా ఆన్‌లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్‌, ఓటీటీల్లో సినిమాల దగ్గరి నుంచి పాటు సోషల్‌ మీడియాలో గడపడం వరకు.. అందరూ ఆన్‌లైన్ బాటే పట్టటడంతో ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో మిలీనియల్స్.. సగటున రోజుకు 3.7 గంటల పాటు మొబైల్‌లోనే గడిపితే, జెనరేషన్ ‘ఎక్స్’ రోజుకు 3 గంటలు, బేబీ బూమర్స్ 2.5 గంటలు స్పెండ్ చేసినట్లు ‘విజిల్ అవుట్’ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఈ క్రమంలో మిలీనియల్స్ తమ లైఫ్ స్పాన్‌లో 9 సంవత్సరాలు మొబైల్‌కే కేటాయిస్తారని విజిల్ అవుట్ తేల్చగా.. ఈ తరం వారికి ఇది వేకప్ అలారం అని, త్వరగా మొబైల్ అడిక్షన్ నుంచి బయటకొస్తేనే ఆరోగ్యానికి, మెంటల్ హెల్త్‌కు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మన జీవితకాలంలో 20-25 సంవత్సరాలు నిద్రకు కేటాయిస్తే, ఇంతేకాలం మన వర్కింగ్ లైఫ్‌కు కేటాయిస్తాం. ఇక ఐదేళ్లు తినడానికి వెచ్చిస్తే, మొబైల్‌కు మాత్రం తొమ్మిదేళ్లు స్పెండ్ చేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే.. మొబైల్‌‌కు మనమిచ్చే ప్రాధాన్యం అర్థమవుతుండగా, ఫోన్ అడిక్షన్ వల్ల ఎంతోమంది నిద్రలేమితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొబైల్‌తో పాటు ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం కూడా విపరీతంగా పెరగగా, ప్రస్తుతం ఒక్కో యూజర్‌ సగటున నెలకు 15.7 జీబీ ఇంటర్నెట్‌ను వాడుతున్నట్టు ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ ఇటీవలే వెల్లడించింది.

photo credit to :https://www.whistleout.com/

Tags:    

Similar News