నేను రాజీనామా చేస్తా.. మీరు ఉద్యోగం వదిలేస్తారా? డీఈవోకు ఎమ్మెల్సీ సవాల్
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా డీఆర్‌సీ సమావేశంలో డీఈవోపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలోని ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై విద్యాశాఖ అధికారులు గుంటూరులో పని చేపిస్తున్నారని తెలిపారు. ఇది సరికాదన్నారు. అయితే కేవలం ఒక్క ఉపాధ్యాయుడే డిప్యూటేషన్‌పై ఉన్నారని డీఈవో సమాధానం చెప్పడంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడే ఐదు పేర్లు చెబుతానని అవి తప్పు అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే మీరు డీఈవో […]
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా డీఆర్‌సీ సమావేశంలో డీఈవోపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలోని ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై విద్యాశాఖ అధికారులు గుంటూరులో పని చేపిస్తున్నారని తెలిపారు. ఇది సరికాదన్నారు. అయితే కేవలం ఒక్క ఉపాధ్యాయుడే డిప్యూటేషన్‌పై ఉన్నారని డీఈవో సమాధానం చెప్పడంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడే ఐదు పేర్లు చెబుతానని అవి తప్పు అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే మీరు డీఈవో నుంచి తప్పుకోండని లక్ష్మణరావు సవాల్ విసిరారు. ఉపాధ్యాయులు కావాలంటే తెనాలి డివిజన్ నుంచి తెచ్చుకోండని.. పల్నాడు నుంచి ఎందుకు పిలిపిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుల చేత నాడు- నేడు పనుల పర్యవేక్షణ, ఇతర బాధ్యతలు అప్పగించడం సరికాదని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు.