ముఖ్యమంత్రి పదవి : తెరపైకి ఈటల రాజేందర్ పేరు

దిశ,వెబ్‌డెస్క్: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనంటూ జరుగుతున్న ప్రచారంపై చెరుకు సుధాకర్ స్పందించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు. సీఎంగా కేటీఆర్ వద్దని, మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో దళితుణ్ని సీఎం చేస్తానని, రాష్ట్రావతరణ తరువాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన […]

Update: 2021-02-04 00:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనంటూ జరుగుతున్న ప్రచారంపై చెరుకు సుధాకర్ స్పందించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు. సీఎంగా కేటీఆర్ వద్దని, మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎంను చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యమ సమయంలో దళితుణ్ని సీఎం చేస్తానని, రాష్ట్రావతరణ తరువాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం పదవి బడుగు బలహీన వర్గాల నాయకులకు ఇస్తే తప్పేంటని సుధాకర్ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కీరోల్ పోషించిన ఈటల రాజేందర్ ను సీఎం చేయాలని నొక్కాణించారు. ఆయన అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News