ఎమ్మెల్యే కొడుకుదే పెత్తనం.. మహిళా చైర్ పర్సన్‌తో వివాదం
దిశ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల 23, 24, 33, 34, 35 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్‌లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు. అయితే, ఆమె పాల్గొన్న 23, 24 వార్డుల్లో ఏ ఫ్లెక్సీలో కూడా తన […]
దిశ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల 23, 24, 33, 34, 35 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్‌లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు. అయితే, ఆమె పాల్గొన్న 23, 24 వార్డుల్లో ఏ ఫ్లెక్సీలో కూడా తన ఫోటో లేకపోవడంతో ప్రోటోకాల్ పాటించరా అంటూ ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవను నిలదీసింది.
వార్డుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే, ఆయన తనయుడు రాఘవ ఫోటోలు మాత్రమే ఉండడంతో చైర్ పర్సన్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. పరిస్థితిని గమనించిన రాఘవ.. ‘మాట్లాడదాం లే’ అంటూ ఆమెని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంతర్గతంగా ఎన్ని వివాదాలు ఉన్నా ప్రోటోకాల్ తప్పనిసరి పాటించాలంటూ స్థానిక పార్టీ క్యాడర్ పెదవి విరుస్తోంది. అయితే, ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు చైర్ పర్సన్ మౌనంగా ఉండటం ఇక్కడ కొసమెరుపు.