పద్ధతి మార్చుకోండి.. ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే రేగా వార్నింగ్
దిశ, మణుగూరు: ఫారెస్ట్ అధికారులపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని శుక్రవారం పోడు రైతులు రేగా కాంతారావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. భూముల్లో మొక్కలు వేసుకుంటే సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై మండిపడ్డారు. మరోసారి పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఈ సందర్భంగా […]
దిశ, మణుగూరు: ఫారెస్ట్ అధికారులపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని శుక్రవారం పోడు రైతులు రేగా కాంతారావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. భూముల్లో మొక్కలు వేసుకుంటే సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై మండిపడ్డారు. మరోసారి పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లడుతూ… పోడు రైతులను ఇబ్బంది పెట్టడం, నాటిన మొక్కలు తొలగించడం మంచిదికాదని సూచించారు.
ఇకపై పోడు రైతులపై అనవసరంగా రెచ్చిపోతే తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా పోడురైతుల విషయంలో ఫారెస్ట్ అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పీటీసీ పోశం నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు అప్పారావు, జీవ వైవిధ్యకమిటీ సభ్యులు తంతరపల్లి కృష్ణ, మాజీ ఎంపీటీసీ మేకల రవి, అశ్వాపురం మండల అధ్యక్షుడు కోడి అమరెందర్, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఫారెస్ట్ అధికారులు, పోడు రైతులు పాల్గొన్నారు.