ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

దిశ‌, ఖ‌మ్మం: రైతులు పండించిన ప్ర‌తి గింజ‌నూ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని వైరా ఎమ్మెల్యే రాములునాయ‌క్ అన్నారు. జిల్లాలోని జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సోమ‌వారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి గడగడలాడిస్తున్న నేప‌థ్యంలో సాగు ప‌నుల‌కు ఆటంకం క‌లుగుతోంద‌న్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బందుల‌తో రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. […]

Update: 2020-04-13 03:16 GMT

దిశ‌, ఖ‌మ్మం: రైతులు పండించిన ప్ర‌తి గింజ‌నూ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని వైరా ఎమ్మెల్యే రాములునాయ‌క్ అన్నారు. జిల్లాలోని జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సోమ‌వారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి గడగడలాడిస్తున్న నేప‌థ్యంలో సాగు ప‌నుల‌కు ఆటంకం క‌లుగుతోంద‌న్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే లాక్‌డౌన్‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బందుల‌తో రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. రైతులు పండించిన ప్ర‌తి గింజ‌నూ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని భ‌రోసానిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బుర్ర రాజశేఖర్, సహకార సంఘం చైర్మన్ వెంకటరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: mla ramulu nayak, sweet corn buying centre, opening, khammam

Tags:    

Similar News