కరోనాతో ఎమ్మెల్యే కేతిరెడ్డి గన్‌మెన్ మృతి
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్ సురేష్ కరోనా వైరస్‌తో మృతి చెందాడు. ‘కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే ఎవరైనా చులకనగా చూస్తారేమోననే మొహమాటంతో మా గన్‌మెన్ సురేష్ మృతి చెందాడు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు. ‘కరోనా రోగిని రోగిగా చూడకండి. అనుమానం వస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. ఈ […]
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్ సురేష్ కరోనా వైరస్‌తో మృతి చెందాడు. ‘కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే ఎవరైనా చులకనగా చూస్తారేమోననే మొహమాటంతో మా గన్‌మెన్ సురేష్ మృతి చెందాడు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు. ‘కరోనా రోగిని రోగిగా చూడకండి. అనుమానం వస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. ఈ విషయంలో అసలు మొహమాట పడకండంటూ’ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూచించారు. కాగా ధర్మవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఏపీలోని ప్రజాప్రతినిధుల్లో కరోనా ఆందోళన కొనసాగుతోంది. తమ దగ్గర పనిచేసే సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పటికే పలువురు అధికారులు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.