బస్తీవాసులను ఆదుకోండి.. కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే
దిశ, ఎల్బీనగర్ : రక్షణశాఖ కోసం ఇండ్లు కోల్పోయిన హస్తినాపురం డివిజన్ రోషన్ దౌలా బస్తీవాసులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రోషన్ దౌలా బస్తీలో 612 ఇండ్లు ఉన్నాయి. పక్కనే 2010లో రక్షణ శాఖకు సంబంధించిన యంత్రాలు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పట్లో బస్తీ వాసుల భద్రత దృష్ట్యా ఇండ్లు ఖాళీ చేయాలని రక్షణ […]
దిశ, ఎల్బీనగర్ : రక్షణశాఖ కోసం ఇండ్లు కోల్పోయిన హస్తినాపురం డివిజన్ రోషన్ దౌలా బస్తీవాసులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రోషన్ దౌలా బస్తీలో 612 ఇండ్లు ఉన్నాయి. పక్కనే 2010లో రక్షణ శాఖకు సంబంధించిన యంత్రాలు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పట్లో బస్తీ వాసుల భద్రత దృష్ట్యా ఇండ్లు ఖాళీ చేయాలని రక్షణ శాఖ నోటీసులు జారీ చేసింది.
దీంతో 2010లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రోషన్ దౌలా బస్తీలో నివసిస్తున్న 612 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రోషన్‌దౌలా బస్తీవాసులకు నష్ట పరిహారం చెల్లించలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఆలస్యం చేయకుండా వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఒక్కో ఇంటికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది అంచనా వేసి దాని ప్రకారం త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి, బస్తీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి. ప్రకాష్, రవి, డేవిడ్, అబ్రహం, జంగన్న, అడవయ్య, రాజుగౌడ్, పెంటయ్య, లక్ష్మయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.