పూరి గుడిసె దగ్ధం.. సహాయక చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే అనుచరులు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్టమల్లారం పరిధిలోని కేసీఆర్ నగర్ ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరిగుడిసె దగ్దమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేసీఆర్ నగరానికి చెందిన కనుక నరేష్ పూరి గుడిసె శుక్రవారం దగ్ధమై రూ.మూడు లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. నరేష్ కొంతకాలంగా వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. అయితే శుక్రవారం రోజువారీ పని నిమిత్తం భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లారు. ఈ క్రమంలో కరెంట్ షార్ట్ […]
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్టమల్లారం పరిధిలోని కేసీఆర్ నగర్ ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరిగుడిసె దగ్దమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేసీఆర్ నగరానికి చెందిన కనుక నరేష్ పూరి గుడిసె శుక్రవారం దగ్ధమై రూ.మూడు లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. నరేష్ కొంతకాలంగా వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. అయితే శుక్రవారం రోజువారీ పని నిమిత్తం భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లారు. ఈ క్రమంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల పూరి గుడిసె దగ్దమైందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నరేష్ కు రూ.మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని సమాచారం.
సహాయక చర్యలు చేపట్టిన రేగా సైన్యం
విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు యువ సైన్యం రేగా ఆదేశాలతో కనుక నరేష్ ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పూరి గుడిసె మంటలతో చెలరేగుతుంటే రేగా యువసైన్యం మంటలను చల్లార్చారు. అనంతరం కనుక నరేష్ కుటుంబానికి ధైర్యం చెప్పి కుటుంబాన్ని రేగా ఆదుకుంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్, మణుగూరు టౌన్ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, యువజన నాయకులు జక్కం రంజిత్, బోయిళ్ళ రాజు, మణుగూరు మండల, టౌన్ సోషల్ మీడియా వారియర్స్ కాట్రగడ్డ సురేదర్, మారోజు రమేష్, మన్యం మీడియా ప్రతినిధి మహేష్, తదితరులు పాల్గొన్నారు.