రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం
దిశ ఖమ్మం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ముదిరాజ్ వన సమరదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఖమ్మంలో ఘనస్వాగతం లభించింది. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి రైతులు వరి కుప్పల మీద పడుకొని అక్కడే వారు చనిపోతున్నారని, అయినా రాష్ట్ర […]
దిశ ఖమ్మం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ముదిరాజ్ వన సమరదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఖమ్మంలో ఘనస్వాగతం లభించింది. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి రైతులు వరి కుప్పల మీద పడుకొని అక్కడే వారు చనిపోతున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం 7 వేల మెట్రిక్ టన్నులు కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎంగా రైతుల సమస్యలు తీర్చాల్సింది పోయి ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని హెచ్చరించారు.