బ్యాంకు అధికారులపై ఎమ్మెల్యే 'దానం' ఆగ్రహం

దిశ, క్రైమ్‌బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి రాగా స్థానికులతో పాటు ఎమ్మెల్యే దానం.. బ్యాంకు అదికారులను ఆదివారం నిలదీశారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో రజాకార్లకు సంబంధించినదిగా భావిస్తున్న స్థలంలో 1954 నుంచి 1998 వరకూ ప్రభుత్వ పాఠశాల నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ భవనం శిథిలావస్థకు చేరడంతో స్కూల్ నిర్వహణ కావడం లేదు. ఇదిలా ఉండగా, […]

Update: 2020-07-26 12:06 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి రాగా స్థానికులతో పాటు ఎమ్మెల్యే దానం.. బ్యాంకు అదికారులను ఆదివారం నిలదీశారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో రజాకార్లకు సంబంధించినదిగా భావిస్తున్న స్థలంలో 1954 నుంచి 1998 వరకూ ప్రభుత్వ పాఠశాల నిర్వహించారు.

ప్రస్తుతం అక్కడ భవనం శిథిలావస్థకు చేరడంతో స్కూల్ నిర్వహణ కావడం లేదు. ఇదిలా ఉండగా, ఈ స్థలం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు పేరుపై ఉన్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ స్థలాన్ని తనఖా పెట్టిన కావూరి.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో లోను తీసుకున్నారు. అయితే, రుణం చెల్లించనందున ఇటీవల ఈ స్థలాన్ని బ్యాంకు అధికారులు ఆన్‌లైన్ ద్వారా వేలం వేశారు. అట్టి స్థలాన్ని దక్కించుకున్న వ్యక్తులు స్థలం వద్దకు రావడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న దానం నాగేందర్ స్థానికులతో పాటు గొంతు కలిపి బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News