మిథాలీ.. చీర కట్టి బ్యాటు పట్టి!
దిశ, వెబ్‌డెస్క్: ఆటలోనే కాదు, ఏ పోటీలోనైనా ముందుటామని తెలిసేలా మహిళల శక్తి, సామర్థ్యాలేంటో ప్రపంచానికి చాటిచెప్పిన మన భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ గురించి ఇప్పుడు మనం మరోసారి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోను చూసినవారు పలు రకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. విషయమేమిటంటే.. ఐసీసీ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆటలోనే కాదు, ఏ పోటీలోనైనా ముందుటామని తెలిసేలా మహిళల శక్తి, సామర్థ్యాలేంటో ప్రపంచానికి చాటిచెప్పిన మన భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ గురించి ఇప్పుడు మనం మరోసారి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోను చూసినవారు పలు రకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
విషయమేమిటంటే.. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అయితే ఇదేరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకున్న మిథాలీ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహిళలకు ఓ మెసేజ్ ఇచ్చింది. సో.. ఆ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఆ వీడియోలో మిథాలీ ప్రత్యేకంగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. చీర కట్టుకుని, బొట్టు పెట్టుకొని క్రికెట్ ఆడింది. ఆ వీడియోకి క్యాప్షన్ కూడా పెట్టారు. మీరు కట్టుకున్న ప్రతీ చీర మీ కన్నా కూడా మరింత ఎక్కువగా మాట్లాడుతుందని, అదేవిధంగా మీరు ఎప్పుడూ దృఢంగా ఉండాలని ఆ చీర ఎప్పుడూ కోరుకోదని, సో.. మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించండని, అదేవిధంగా మహిళా దినోత్సవం రోజున ప్రతి ఒక్క మహిళా తానేంటో అన్నది ప్రపంచానికి తెలియజేయాలంటూ మహిళలను ఉత్తేజపరుస్తూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
దీంతో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మిథాలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే షూస్, హెల్మెట్, ప్యాడ్స్, గ్లోవ్స్ ఇలా తదితర జాగ్రత్తలతో తగిన విధంగా జెర్సీని ధరించి క్రికెట్ ఆడుతుంటారు. కానీ, మిథాలీ మాత్రం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా చీర కట్టి క్రికెట్ ఆడి తన ప్రత్యేకతను చాటుకుంది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మీరు ఎందరికో ఆదర్శమని, మీరు చీర కట్టి క్రికెట్ ఆడితే ఇక మిమ్మల్నెవరూ క్లీన్ బౌల్డ్ చేయబోరని, ఇలాగే క్రికెట్ ఆడాలన్న విధానానికి మీరు అడ్డుకట్ట వేశారంటూ కామెంట్లు పెడుతూ మిథాలీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.