‘భగీరథ’కు అడుగడుగునా అడ్డంకులు..

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం : భ‌గీర‌థ ప‌థ‌కం ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో గ‌మ్యం చేరింది.. గ‌మ‌నంలో మాత్రం త‌ప్పట‌డుగులు కొన‌సాగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సీజ‌న‌ల్‌గా స‌మ‌స్యలు వ‌చ్చి ప‌డుతున్నా య్‌.. మూణ్ణెళ్లకు ఒక‌మారు నీటి స‌ర‌ఫ‌రా బంద్ అవుతున్నట్లుగా ‘దిశ నెట్‌వ‌ర్క్’ ప‌రిశీల‌న‌లో తేట‌తెల్లమైంది. భ‌గీర‌థ ప‌థ‌కం కింది ప్రత్యేకంగా నిర్మా ణం జ‌రిగిన OHRS ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. న‌ల్లాల బిగింపు స‌గానికంటే ఎక్కువ‌గా పూర్తయింది. అయితే కొన్ని ఊర్లల్లో మాత్రం ఊరికొచ్చిన […]

Update: 2020-09-09 03:57 GMT

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం : భ‌గీర‌థ ప‌థ‌కం ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో గ‌మ్యం చేరింది.. గ‌మ‌నంలో మాత్రం త‌ప్పట‌డుగులు కొన‌సాగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సీజ‌న‌ల్‌గా స‌మ‌స్యలు వ‌చ్చి ప‌డుతున్నా య్‌.. మూణ్ణెళ్లకు ఒక‌మారు నీటి స‌ర‌ఫ‌రా బంద్ అవుతున్నట్లుగా ‘దిశ నెట్‌వ‌ర్క్’ ప‌రిశీల‌న‌లో తేట‌తెల్లమైంది. భ‌గీర‌థ ప‌థ‌కం కింది ప్రత్యేకంగా నిర్మా ణం జ‌రిగిన OHRS ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. న‌ల్లాల బిగింపు స‌గానికంటే ఎక్కువ‌గా పూర్తయింది. అయితే కొన్ని ఊర్లల్లో మాత్రం ఊరికొచ్చిన నీరు.. ఇంటికి రావ‌డంలేద‌ని జ‌నం వాపోతున్నారు. అంతే కాదు నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఎక్కువ‌గా ఉంద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇదీ ప‌రిస్థితి..

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఇప్పటికే మిషన్ భగీర‌థ ప‌నులు దాదాపు పూర్తి కావ‌చ్చాయి. గ్రామాల్లో ఇంట్రా వ‌ర్క్స్ కూడా పూర్తి చేసిన‌ట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంటిం టికీ న‌ల్లాల బిగింపు కార్యక్రమం కొన‌సాగుతోంది. మిష‌న్ భ‌గీర‌థ‌కు నీటి స‌ర‌ఫ‌రాకు సంబం ధించి ప్రత్యేకంగా కొత్తగా ఖమ్మం జిల్లాలో 564 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మంజూర‌య్యాయి. ఇందు లో అన్ని పూర్తయ్యాయి. 2000 కిలో మీట‌ర్ల మేర పైపులైన్ నిర్మాణాలు కూడా గ్రామాల్లో పూర్తి చేశా రు. మ‌రో 2000ల‌కు పైగా ఉన్న పంచాయ‌తీ పై పులైన్లకు అనుసంధానం చేసి మొత్తం 4000కిలోమీట‌ర్లతో విస్తరించి ఉన్న పైపులైన్ల ద్వారా ఖ‌మ్మం జిల్లాలో భ‌గీర‌థ నీటిని ఇంటింటికి చేర్చుతున్నారు.

అలాగే భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 803 ఓహె చ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వ‌ర‌కు 748 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 55 పనులు పురోగతిలో ఉన్నాయి. భ‌ద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో 2,23,043 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 1.60 ల‌క్షల ఇళ్లకు భ‌గీర‌థ న‌ల్లా కనెక్షన్ ఇవ్వడం ల‌క్ష్యం గా పెట్టుకున్నారు. ఇప్పటి వ‌ర‌కు 118800 ఇళ్లకు క‌నెక్షన్ ఇచ్చారు. ఇంకా 50580 ఇళ్లకు క‌నెక్షన్ ఇవ్వాల్సి ఉంది.1127కిలోమీట‌ర్ల మేర భ‌గీర‌థ పై పులైన్ నిర్మాణం చేప‌ట్టాల్సి ఉండ‌గా ఇప్పటి వ‌ర‌కు 1120కిలోమీట‌ర్ల మేర పూర్తి చేశారు. ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల విష‌యంలోనే వెన‌క‌బ‌డి ఉండ‌గా క‌లెక్టర్ ఎంవీరెడ్డి ఎప్పటిక‌ప్పుడు అధికారుతో స‌మీక్ష ని ర్వహించి వేగిరంగా పూర్తయ్యేలా చేస్తున్నారు.

లీకేజీలు.. కాలిపోతున్న మోటార్లు..

మిష‌న్ భ‌గీర‌థ‌ను ఊర్లల్లోకి చేర్చడంలో చాలా వ‌ర‌ కు విజ‌య‌వంతమైన అధికారులు.. వాటి స‌ర‌ఫ‌రా విష‌యాన్ని మాత్రం గాలికి వ‌దిలేసిన‌ట్లుగా తెలు స్తోంది. అధికారుల ప‌ర్యవేక్షణ కొర‌వ‌డ‌డంతో నే చాలా చోట్ల మోటర్లు కాలిపోవ‌డం వంటి కార‌ణం తో స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అలాగే లీకేజీలు నిత్యకృత్యంగా మారాయి. లీకేజీల‌తో రోడ్లు గోదా రుల‌ ను త‌లంపించిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇ టీవ‌ల కొత్త‌గూడెం ప‌ట్టణంలోని ప్రధాన రోడ్డుపై వ‌ర‌ద ప్ర వ‌హాన్ని త‌ల‌పించింది. కిందిస్థాయి సిబ్బంది వైఫ‌ ల్యం, నిర్లక్ష్యం కార‌ణంగా త‌మ‌కు రోజు నీళ్లు రావ‌ డం లేద‌ని కొన్ని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News