ఆరు నెలలుగా అదృశ్యం.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
లక్నో: ఆయన ఓ ఐపీఎస్ అధికారి. ఓ జిల్లాకు ఎస్పీగా సర్వీసు చేశారు. సీరియస్ క్రైమ్‌లను ఇన్వెస్టిగేట్ చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆపరేషన్లు చేపట్టారు. ఏ మాఫియాకు అయినా కొందరు అవినీతి అధికారుల అండ ఉండటం సాధారణం. ఈ క్రమంలో మాఫియాపై దర్యాప్తుచేసే వారికి సొంత గూటి నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇదే రీతిలో కొన్ని కేసులు ఆ అధికారిపై నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఐపీఎస్ […]
లక్నో: ఆయన ఓ ఐపీఎస్ అధికారి. ఓ జిల్లాకు ఎస్పీగా సర్వీసు చేశారు. సీరియస్ క్రైమ్‌లను ఇన్వెస్టిగేట్ చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆపరేషన్లు చేపట్టారు. ఏ మాఫియాకు అయినా కొందరు అవినీతి అధికారుల అండ ఉండటం సాధారణం. ఈ క్రమంలో మాఫియాపై దర్యాప్తుచేసే వారికి సొంత గూటి నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇదే రీతిలో కొన్ని కేసులు ఆ అధికారిపై నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఆరు నెలలుగా కనిపించకుండా పోవడం.. దర్యాప్తు అధికారులూ పట్టుకోకపోవడం.. చివరికి ఒక ఐపీఎస్ అధికారే కనిపించట్లేదని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలవ్వడం.. లాంటివన్నీ అసాధారణ పరిణామాలను వెల్లడిస్తున్నాయి. ఇదంతా ఓ యాక్షన్ ప్యాక్ట్ సినిమా స్టోరీలా అనిపిస్తు్న్నా ఈ అంశాలన్నీ అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్నది. హై ర్యాంకింగ్ అధికారి కనిపించకుండా పోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. ఆయన ఆచూకీ కోసం వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాల్సిన అవసరముందని, అసలు ఆయన బతికే ఉన్నాడా? లేడా? అనే విషయం తేలాల్సి ఉందని పేర్కొంది.
ఐపీఎస్ అధికారి, మహోబా జిల్లా మాజీ ఎస్పీ మణిలాల్ పాటిదార్ గతేడాది నవంబర్ నుంచి అదృశ్యమయ్యారని, వెంటనే ఆయనను కోర్టులో సమర్పించాలని కోరుతూ ఆయన తరఫు అడ్వకేట్ ముకుత్ నాథ్ వర్మ అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పాటిదార్ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆపరేషన్లు చేశారని, దీంతో అధికార యంత్రాంగంలోని కొన్ని వర్గాలతో ఆయన బంధాలు చెడిపోయాయని పిటిషన్‌లో అడ్వకేట్ పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని కేసుల్లో ఆయనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు.
రాష్ట్రంలోని ఉన్నతస్థాయి అధికారుల్లో కొందరు ఏదో తప్పు చేసి ఉంటారని, దాని ఫలితంగా పాటిదార్ మిస్సై ఉండొచ్చని తెలిపారు. బహుశా పాటిదార్ అధికారుల తప్పుడు పనులను బయటపెట్టే అవకాశముండటంతో కనిపించకుండా చేశారేమోనని, లేదంటే కొందరు కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనకు ప్రాణ హానీ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పెండింగ్ లీగల్ మ్యాటర్స్ కోసం గతేడాది నవంబర్ 15న తనకు పాటిదార్ నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చిందని, అదే నెల 27న కలుస్తానని చెప్పారని, కానీ, అప్పటి నుంచి మళ్లీ కాంటాక్ట్‌లోకి రాలేదని వివరించారు. కాబట్టి, వెంటనే ఈ ఉదంతపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. కాగా, పాటిదార్‌పై దాఖలైన కేసుల్లో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురవ్వడంతో అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తు్న్నాడని ప్రభుత్వం నుంచి వివరణ వచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి అధికారుల ప్రతిష్టను దెబ్బతీసే ఆలోచనలు చేసి ఉంటారని తెలిపింది.
వాదులు, ప్రతివాదులూ పాటిదార్ అదృశ్యమైనట్టు అంగీకరిస్తున్నారని, కాబట్టి, వెంటనే ఆయన ఆచూకీ వివరాలను, అసలు ఆయన బతికి ఉన్నాడా? లేదా? అనే విషయాలను దర్యాప్తు చేయాల్సిన అవసరముందని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సయ్యద్ అఫ్తాబ్ హుసేన్ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్ మిస్సవ్వడం సీరియస్ ఇష్యూ అని తెలిపింది. ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరించిన తర్వాత ఆయనను పట్టుకోవడానికి దర్యాప్తు ఏజెన్సీలు తీసుకున్న చర్యలను వివరించాల్సిందిగా ఆదేశించింది.