అక్రమ మట్టి రవాణాలో మగ్గుతున్న మైనర్లు..
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మణుగూరు-ఏడుళ్ల బయ్యారం ప్రధాన రహదారిపై మట్టి ట్రాక్టర్లు జోరుగా తిరుగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు కళ్ళతో చూసి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల పేరుతో ప్రైవేటుకు మట్టిని తరలిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని మట్టి మాఫియా అక్రమార్కులు రెచ్చి పోతున్నారు. ఒకవైపు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పలు నిబంధనలను […]
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మణుగూరు-ఏడుళ్ల బయ్యారం ప్రధాన రహదారిపై మట్టి ట్రాక్టర్లు జోరుగా తిరుగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు కళ్ళతో చూసి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల పేరుతో ప్రైవేటుకు మట్టిని తరలిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని మట్టి మాఫియా అక్రమార్కులు రెచ్చి పోతున్నారు. ఒకవైపు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పలు నిబంధనలను జారీ చేసినప్పటికీ, మండలంలో రెవెన్యూ, పోలీసు అధికారులు మట్టి మాఫియా అక్రమార్కులు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తేటతెల్లం అవుతుంది.
రెవెన్యూ, పోలీసు అధికారులే మట్టి మాఫియాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మణుగూరు మండల కేంద్రంలో రెవెన్యూ, పోలీసు అధికారులే మట్టి మాఫియాతో ఏకమై ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రజలు, అఖిలపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులే మట్టి మాఫియాకు అండగా నిలుస్తున్నారని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర పోలీస్ అధికారి(డీజీపీ) మహేందర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన సమయం తర్వాత రోడ్లపైకి వాహనాలు తిరిగితే సీజ్ చేయమని ఉత్తర్వులు జారీ చేసిన, మణుగూరు పోలీస్ అధికారులు మాత్రం రాష్ట్ర డీజీపీ మాటలను పట్టించుకోవడం లేదని ఈ మట్టి మాఫియా ద్వారా అర్థమవుతుంది.
వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో మట్టి తవ్వకాలను మైనర్ బాల్యంతో నడిపిస్తున్నారు. అభం శుభం తెలియని పసివాళ్లను మట్టి మాఫియాలో దింపి వారితో వాహనాలను నడిపిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ అనే బాలుడు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ ప్రభావితం వల్ల పాఠశాలలు లేనందున మట్టి మాఫియా ఈ బాలుడిని మట్టి ఊబిలో దింపి నానా పనులు చేయించుకుంటూ అనేక రకమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలకు మైనర్ బాల్యంతో నడిపిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలను నడుపుతున్న బాల్యంకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మైనర్ బాల్యంతో పనులు చేపిస్తూతున్నటువంటి మట్టి మాఫియా అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు మైనర్ బాల్యంతో పనులు చేయిస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించి, మట్టి మాఫియాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.