రాముల‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు

దిశ‌, ఖ‌మ్మం: భద్రాద్రి సీతారాముల క‌ల్యాణోత్స‌వానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంప‌తులు, రాష్ట్ర‌ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంప‌తులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున అధికారిక క‌ల్యాణ వేడుక‌ల్లో స‌ల‌హాదారులు కెవి రమణ చారి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మహబూబాద్ ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య, దేవాదాయ శాఖ […]

Update: 2020-04-02 00:43 GMT

దిశ‌, ఖ‌మ్మం: భద్రాద్రి సీతారాముల క‌ల్యాణోత్స‌వానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంప‌తులు, రాష్ట్ర‌ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంప‌తులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున అధికారిక క‌ల్యాణ వేడుక‌ల్లో స‌ల‌హాదారులు కెవి రమణ చారి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మహబూబాద్ ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌, ఆల‌య ఈవో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Tags : TS Ministers, presented, Silk garments, Sriramanavamy, bhadrachalam

Tags:    

Similar News