మేము సైతం అంటున్న మంత్రులు
దిశ, మహబూబ్ నగర్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లోనే ఉండిపోయారు. కుటుంబ సభ్యులతో కలసి తోట పని చేస్తూ గడిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 100 శాతం జనతా కర్ఫ్యూ పాటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్ వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమయ్యారు. వరంగల్‌లో స్వచ్ఛంద బంద్ దిశ, వరంగల్: ఉమ్మడి […]
దిశ, మహబూబ్ నగర్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లోనే ఉండిపోయారు. కుటుంబ సభ్యులతో కలసి తోట పని చేస్తూ గడిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 100 శాతం జనతా కర్ఫ్యూ పాటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్ వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమయ్యారు.
వరంగల్‌లో స్వచ్ఛంద బంద్
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బస్టాండ్లు బోసిపోయాయి. పెట్రోల్ బంకులు, హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. ప్రజలు స్వచ్ఛదంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.
అనుమానితుల కోసం గాలింపు
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అధికార యంత్రాంగం వేట కొనసాగుతోంది. నగరానికి వచ్చిన ఇండోనేషియా మత ప్రచారకులు ఎవరెవరిని కలిశారన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మానకొండూర్ మండలం సదాశివపల్లిలో కరోనా అనుమానితులను గుర్తించారు. సదాశివపల్లి గ్రామస్తుల సమాచారం మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారిని కరీంనగర్ ఐషోలేషన్ వార్డుకి తరలించినట్టు సమాచారం. ఈ ఇద్దరిని ఇండోనేషియా మత ప్రచారకులను కలిసినట్లు అనుమానిస్తున్నారు.
Tags: karimnagar, warangal, mahaboob nagar, jantha currfew, ministers niranjan reddy, srinivas goud quarantine