జీఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ!
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాల్సిన వస్తువులు, ప్రస్తుతం ఉన్న శ్లాబ్ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించడం లాంటి అంశాలపై సమీక్ష జరిపి నివేదికలను రూపొందించనున్నాయి. అంతేకాకుండా ఆదాయ పన్ను వ్యవస్థలో మార్పుల గురించి కూడా మార్పులను సూచించనున్నాయి. ఈ నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు మంత్రివర్గ కమిటీలను ఏర్పాటు చేయాలన్న […]
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాల్సిన వస్తువులు, ప్రస్తుతం ఉన్న శ్లాబ్ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించడం లాంటి అంశాలపై సమీక్ష జరిపి నివేదికలను రూపొందించనున్నాయి. అంతేకాకుండా ఆదాయ పన్ను వ్యవస్థలో మార్పుల గురించి కూడా మార్పులను సూచించనున్నాయి.
ఈ నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు మంత్రివర్గ కమిటీలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఆధారంగా వీటిని ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో ఉండే కమిటీని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలసిన వస్తువులు, శ్లాబ్ రేట్ల విలీనం లాంటి అంశాల కోసం నియమించారు. ఈ కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదికను అందజేయనున్నారు. ఇక, పన్ను ఎగవేతదారులను గుర్తించడం, జీఎస్టీ వ్యవస్థలో మార్పుల గురించి ఎనిమిది మందితో రెండో కమిటీని ఆమోదించారు. దీనికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు.