లాక్ డౌన్‌కు ప్రజలు సహకరించాలి: మంత్రి సబితా
దిశ, రంగారెడ్డి: కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మంత్రి గురువారం మీర్పెట్, బడాంగ్ పెట్‌లో పర్యటించారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న వారిని నిశితంగా గమనించాలన్నారు. కూరగాయలను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు పై ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం విధించిన […]
దిశ, రంగారెడ్డి: కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మంత్రి గురువారం మీర్పెట్, బడాంగ్ పెట్‌లో పర్యటించారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న వారిని నిశితంగా గమనించాలన్నారు. కూరగాయలను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు పై ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీర్ పెట్ నుంచి అల్మాస్ గూడ వైపు వెళ్తున్న మంత్రి కారు ఆపి మార్గ మధ్యలో రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లారు. అక్కడ ఓ బాలుడు ఉండటాన్ని గమనించిన మంత్రి.. సదరు దుకాణ దారునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం 3 ఏళ్ల బాలుడికి వైరస్ సోకిందని, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
Tags: minister, sabhitha indrareddy, carona, ts news