అప్పుడు జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదు: మంత్రి వెల్లంపల్లి

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, బీజేపీ నేతలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసంపై సిట్ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతాయని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 40ఆలయాలను కూల్చారని, అప్పుడు మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉంటే జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలపై జీవీఎల్ ఏనాడైన రాజ్యసభలో మాట్లాడారా అన్న మంత్రి వెల్లంపల్లి.. టీడీపీ, బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు కూల్చిన ఆలయాలను మేం పున: […]

Update: 2021-02-03 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, బీజేపీ నేతలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసంపై సిట్ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతాయని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 40ఆలయాలను కూల్చారని, అప్పుడు మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉంటే జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలపై జీవీఎల్ ఏనాడైన రాజ్యసభలో మాట్లాడారా అన్న మంత్రి వెల్లంపల్లి.. టీడీపీ, బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు కూల్చిన ఆలయాలను మేం పున: నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News