ఎంపీటీసీల సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శనివారం రాత్రి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరపడానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మేరకు కృతజ్ఞతలు […]

Update: 2021-11-27 11:30 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శనివారం రాత్రి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరపడానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలుగా ఎంపికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్లా దామోదర్ రెడ్డి మంచి అనుభవజ్ఞులు. వారిని కలుపుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News